శృంగారం అంటే బూతుకాదు - మనుసును ఉల్లాసంగా వుంచే మహత్తర శక్తి శృంగారంశృంగారం అంటే బూతుకాదు, అరవై నాలుగు కళలలో శృంగారం కూడా ఒకటి. దైనందిన జీవితంలో వుత్సాహంగా ఉండటం వెనక శృంగారానికెంతో ప్రాధాన్యత ఉంది. వయసుతో నిమిత్తం లేకుండా మనుసును ఉల్లాసంగా వుంచే మహత్తర శక్తి శృంగారానికి వుంది. ఎందరో ప్రఖ్యాత సెక్సాలాజీలు తమ పరిశోధనల సారాంశాన్ని మనకు అందిస్తున్నప్పటకీ సామాన్యులకు అందుబాటులో లేదన్నది వాస్తవం! కేవలం అపోహాల వల్లనే పండంటి సంసారాలను కూల్చివేసుకునే దంపతలునున్నారు.పెళ్లయి కూడా సెక్స్ పట్ల అవగాహన లేక దాంపాత్యాన్ని సజావుగా కొనసాగించలేక పిన్నవయసులోనే విడిపోయే యువతీయువకులున్నారు. నడివయసులో కొచ్చాక తమలో సెక్స్ సామర్థ్యం సన్నగిల్లి పోయిందనే మానసిక వ్యథతో కృంగిపోతూ జీవితంలో ఆనందాన్ని పొందడానికి బదులు నిరాశా నిస్పృహలకు లోనయ్యే భార్యభర్తలున్నారు. వీళ్లందరి సమస్య ఒకటే.. సెక్స్ పట్ల సరయిన అవగాహన లేకపోవటం, లైప్పార్టనర్ను యెలా సుఖపెట్టాలి అనేది తెలియక పోవడం. తెలిసి తెలియక పోవడం, తెలిసీ తెలియని వయసులో తమకు తెలిసిందే శృంగారమని భావించడం వలన అపశృతులు దొర్లి జీవితంలో సెక్స్లోపించి, జడులుగా మారిపోతున్నారు.ఇలాంటి వారిక సెక్స్ కౌన్సిలింగ్ యెంతో ఉపయోగిస్తుంది. సెక్స్ థెరఫీస్టులను సంప్రదించి. చేజారిపోయిన శృంగార స్వప్నం చేతికందినట్టే! శాంగార సౌఖ్యాన్ని పెంచే సూత్రాలు : దంపతులు శృంగారానుభూతినిపొందడంలో అడ్డు వచ్చే పలు అవరోధాలను తొలిగించేందుకు ఉపకరించే సూత్రాలు కొన్నిఉన్నాయి. వీటిని శృంగార సౌఖ్యాన్ని పెంచే సూత్రాలుగాచెప్పవచ్చు. శృంగారానుభూతికిపూర్తి భాధ్యతను మీరే తీసుకోవాలి. నిజానికి శృంగారానుభవానికి సంబంధించి అనేకమైన అపోహల్లో సాధారణంగా కనిపించేది. ఎంటంటే, తన బాధ్యత ఏమీ లేకుండా తన జీవన సహచరుడు లేదా సహచరురాలు మాత్రమే శృంగారానుభవాననిఇస్తారనీ, గొప్ప సౌఖ్యాన్ని మిగులుస్తారని భావించడం. నిజానికి ఇది చాలా తప్పు సాధారణంగా పూర్తి సామాజిక కుటంభిక స్వేచ్ఛను అనుభవించే పురుషులు చాలా త్వరగా శృంగార వాంఛలను పూర్తిస్థాయిలో తెచ్చుకొని గొప్ప అనుభవాన్ని మిగులుకోగలుగుతారు.. కానీ సామాజిక కారణాల వల్ల స్త్రీలలో ఇలాంటి పరిస్థితి ఉండదు. శృంగారపరంగా తమ భావాలు, చెష్టలు పట్ల స్త్రీలు సంతోషంగా స్పందించాలని పురుషులు ఆశిస్తారు. అయితే ఇలాంటి పురుషులు స్త్రీలో (భార్యలో) తన పట్ల శృంగారభావాన్ని కలిగించడంలో 75శాతం వైఫల్యం చెందుతాడని సర్వేలో తేలింది. అయితే శృంగార జీవితానికి సంబందించిన ఈ పరస్పర ఆధారిత మనస్తత్వం, స్వంత ప్రేరేపిత మనస్తత్వం, శృంగారరానుకూల భావజాలం లేక పోవడం, ఇవన్నీ శృంగార సమస్యలకు దిరి తీస్తాయి. దంపతులు తాము శృంగారానుభూతులుపొందడానికి ఎవరికివారు పూర్తి బాధ్యతతో ఉండాలి. మానసిక సంసింద్దత, శృంగార ప్రేరక స్థానాల జ్ఞానం, పరస్పర శరీర శృంగార బాషపట్ల అవగాహన, అన్నింటికీ మించి గొప్ప శృంగారానుభూతులుమిగుల్చుకోవాలన్న బాధ్యత కలిగి వుండాలి. పురుషుల వ్యక్తిగత అహంకారపూరిత ప్రవర్తన కూడా స్త్రీలలో తమభర్తల పట్ల శృంగారవాంఛను చంపే అవకాశం ఉంది. పురుషులు ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. స్త్రీ ప్రేమను ప్రేమతో పొందాలి. అధికారం, ఆధిపత్య ధోరణిలో మాత్రం సాధ్యం కాదన్న వషయం తెలుసుకుని ఉండాలి. ఈ రకంగా తమ పంచేంద్రియాలు, శృంగారానుభూతులుపొందడం పట్ల పూర్తి బాధ్యతతో ఉండే స్త్రీ పురుషులు ఒకరినొకరు ఒక గొప్ప సందేహాన్ని ఇచ్చుకునే వారు అవుతారు. అదేంటంటే ‘‘ నేను నీ పట్ల పూర్తి బాధ్యతను తీసుకుంటాన్నాను, నాకేం కావాలో ఎలా వుంటే, ఏం చేస్తే నాకు సౌఖ్యమో, ఆనందమో నీకు తెలియజేసే పని నీ బదులు నేనే చేస్తున్నాను’’ శృంగారం గురించి మీ జీవన సహచరులతో స్వేచ్ఛగా మాట్లాడండి.....మన సమాజంలో అనాధి నుంచీ శృంగారాన్ని గురించి స్వేచ్ఛగా మాట్లాడటం, సహజంగా చర్చించకోవడానికి అనుకూల వాతావరణం లేదు. ప్రస్తుత సామాజిక పరిస్థితి అలాగే ఉంది. పరస్పర లైంగిక ప్రవర్తనల గురించి తెలుసుకోవడానికీమాట్లాడడానికీ కూడా సంకోచించే స్థితిలో చాలామంది దంపతులు ఉన్నారు. శృంగారమనే ఆలోచనే ఒక పెద్ద మానసిక అవరోథకంగా మారి దాని సహజత్వాన్ని కోల్పోయింది.ఆరోగ్యకరమైన శాస్త్రీయమైన లైంగికజ్ఞానాన్ని స్త్రీ పురుషులిరువురూ కలిగి ఉండటం మూలంగా ఎన్నో అనార్థాలు తొలుగే అవకాశం ఉంది. అన్నింటికీ మించి తెలుసుకోవాలన్న తపనతో పరస్పర దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడటం చర్చించడం ద్వారా ఇద్దిర మధ్య ఏ సమస్య? లేదా స్పష్టత లేకపోతే మంచి సెక్సాలజిస్టునుకలిసి సెక్స్ ఎవర్షన్ ను, కౌన్సిలింగ్ మరియు థెరఫీ రెండూ మీభర్తతో కలిసి తీసుకోండి. భావసారూప్యత భావనినిమయం పెరిగి అనియంత్రిత స్వేచ్ఛాపూర్వకమైన గౌరవప్రధమైన శృంగారంలో వైఫల్యం చెందిన తర్వాత వెంటనే చాలా మంది ఒక చౌకబారు శృంగార సాహిత్యాన్ని చదివో, ఆ విషయం పట్ల అవగాహన లేని స్నేహితుడి మాటలు వినో తాము చేసింది తప్పని బాధపడతుంటారు. ఇలా కాకుండా మంచి అర్హత పొందిన సెక్సాలజీస్టులురాసిన పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవడం ఉత్తమం. జీవితాన్ని నడిపించే పలప్రధం చేసే శృంగార శాస్త్రం గురించి తెలుసుకుని చర్చించుకోవడం మంచిపనే, తప్పు ఎంత మాత్రము కాదు. శృంగారానికి సంబంధించిన పుస్తాకాలు చదవడం, సహచరులతో మాట్లాడడం వల్ల వ్యక్తం చేయలేని శృంగార భావాన్ని, అర్థం చేసుకోలేని శృంగార సంకేతాలను దేహభాషతో సహ అర్థం చేసుకుని శృంగార జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment