Saturday, 5 May 2018

Airtel Rs.93 Recharge Now Offers Unlimited Calls 1gb data 28 days Validity



<h1>రూ.93తో నెలంతా అపరిమిత కాల్స్, 1జిబి డేటా</h1>

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.93 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్‌తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1జీబీ డేటా, అలాగే ఉచితంగా 100 ఎస్సెమ్మెస్‌లను ఇస్తున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. జియో అందిస్తున్న రూ.98 రిఛార్జ్ ఆఫర్‌కు పోటీగా భారతీ ఎయిర్‌టెల్ ఈ ప్రత్యేక ఆఫర్ ప్రవేశపెట్టింది. కాగా ఈ కొత్త బడ్జెట్ ప్లాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కస్టమర్లకు మాత్రమేనని సమాచారం. వినియోగదారులు సంబంధిత ఆపరేటర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా 2017 డిసెంబర్‌లో రూ.93 రిఛార్జ్‌పై కేవలం 10 రోజుల పాటు మాత్రమే 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది.దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీ దీన్ని లాంచ్ చేసింది.

No comments:

Post a Comment