*"నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు…*
నీ అవసరం ఉన్నవాళ్లను తప్పించుకొని తిరగవద్దు...
నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు...
నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మరచిపోవద్దు..."
"పొగిడేవారు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు...!
తిట్టే వారు నీ పక్కన ఉంటే నువ్వు ఒడినట్టు కాదు...!"
ఏదైనా మనలో మితిమీరిన ఖర్చు ... పేదరికం పాలు చేస్తుంది.
మితిమీరిన పొదుపు .. కష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన సంపాదన ... మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.
మితిమీరిన కర్తవ్యం ...అగచాట్ల పాలు చేస్తుంది.
మితిమీరిన క్రమ శిక్షణ ... రక్త సంబధీకులను దూరం చేస్తుంది.
మితిమీరిన బాధ్యతలు ... అప్పుల పాలు చేస్తుంది.
మితిమీరిన హాస్యం ... నవ్వుల పాలు చేస్తుంది.
మితిమీరిన కోపం ... శతృవులను వృద్ధి చేస్తుంది.
మితిమీరిన ఆలోచనలు ... జీవితాన్ని దుర్భరం చేస్తుంది
మితిమీరిన స్వార్ధం ... అందరినీ దూరం చేస్తుంది.
మితిమీరిన పోటీ ... నష్టాల పాలు చేస్తుంది.
మితిమీరిన లాభార్జన ... వ్యాపార ఉనికికే మోసం తెస్తుంది .
మితిమీరిన వస్తుత్పత్తి ... నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.
మితిమీరిన గర్వాహంకారం ... ఆపదలు కొని తెస్తుంది.
మితిమీరిన అలంకారం ... వెగటు పుట్టిస్తుంది
మితిమీరిన అత్యాశ .. నేరాల పాలు చేస్తుంది.
మితిమీరిన త్యాగం ... కడగండ్ల పాలు చేస్తుంది.
మితిమీరిన జనాభా పెరుగు దల…దేశ ప్రగతిని త్రొక్కేస్తుంది.
మితిమీరిన స్నేహాలు ... అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది.
మితిమీరిన గారాబం ...చెడు స్నేహాల పాలు చేస్తుంది.
మితిమీరిన వేదాంతం… వెటకారం పాలు చేస్తుంది.
మితిమీరిన ఈర్షా ద్వేషాలు ... నిద్రా సుఖాన్ని దూరం చేస్తుంది
మితిమీరిన ప్రేమ ... అనుమానాలకు దారి తీస్తుంది.
మితిమీరిన నమ్మకం … ద్రోహానికి దోహదం చేస్తుంది.
మితిమీరిన విశ్వాసం ...లోకువ పాలు చేస్తుంది.
మితిమీరిన ఋణం ... మరణం పాలు చేస్తుంది.
మితిమీరిన అభిరుచి ... దుబారాకు దారి తీస్తుంది.
మితిమీరిన కీర్తి దాహం ...ఆదాయాన్ని మింగేస్తుంది
అదే పూల తోట మూర్తీభవించిన మానవతా విలువలకు అదే పెట్టని కోట.
ఆలోచించండి..... ఆచరించండి.....మీ మన జీవితాన్ని సార్థకం చేసుకోండి...
Saturday, 5 May 2018
నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment