ఒక రోజు పట్నంలో పని చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని కొడుకు స్వగ్రామానికి వచ్చారు. సాయంత్రం పూట తమ పొలాల్లోకి నడిచి వెళుతూ ఉన్నారు. కొడుకు పొలం గట్ల మీద ఒక జత పాత బూట్లు గమనించాడు. పొలంలో దూరంగా ఒక ముసలి వ్యక్తి మడులకు నీళ్ళు పెడుతూ ఉన్నాడు. కొడుకు తండ్రితో నాన్న మనం ఈ బూట్లు దాచి పెట్టి అతన్ని ఆటపట్టిద్దామ అన్నాడు. అపుడు తండ్రి కొంచం డిఫరెంట్ గా ఆలోచించు మనమే అతని బూట్లలో డబ్బులు పెట్టీ అతని గుణాన్ని పరిశీలిద్దాం అన్నాడు.
అనుకున్నదే తడవుగా తండ్రి రెండు అయిదు వందల నోట్లు కొడుకుకి ఇచ్చాడు. కొడుకు ఒక్కొక బూటులో ఒక్కొక నోటు ఉంచి ప్రక్కకు వెళ్లారు. తర్వాత ఆ ముసలి వ్యక్తి పొలంలో నీరు పెట్టడం ముగించుకుని గట్టు వైపు వస్తున్నాడు. అపుడు తండ్రి కొడుకులు దగ్గర్లో ఉన్న పొద వెనుక దాక్కున్నారు. ఆ ముసలి వ్యక్తి గట్టు దగ్గరకు వచ్చి ఒక బూట్లో కాలు పెట్టాడు. ఏదో ఉన్నది అని గమనించి చూస్తే 500 నోటు అయ్యో ఎవరో నా బూట్ లో డబ్బులు పెట్టారే అని చుట్టూ పరికించి ఎవరూ ఎవరది అంటూ గట్టిగా అరిచాడు. తండ్రి కొడుకులు నిశబ్దంగా ఉన్నారు.
కొడుకు చిన్నగా తండ్రి చెవిలో ఏమిటి నాన్న ఎవరైనా డబ్బు కనబడగానే సైలెంట్ గా జేబులో వేసుకుంటారు ఈయనేంటి గట్టిగా అరుస్తున్నాడు అని అడిగాడు. చూస్తూ ఉండు అన్నాడు తండ్రి. ఆ ముసలి వ్యక్తి రెండో బూటు లో కూడా చూసాడు అందులో కూడా 500 నోటు. బూట్లు వేసుకుని చుట్టూ చూసి గట్టిగా ఎవరైనా ఉన్నారా నన్ను ఆట పట్టిస్తున్నారు అని అరిచాడు. చుట్టూ చూశాడు ఎవరూ కనబడలేదు. తండ్రి కొడుకులిద్దరూ నిశబ్దంగా ఉన్నారు. అపుడా ముసలివ్యక్తి ఆకాశం లోకి చూస్తూ అయ్యో దేవుడా అనారోగ్యంతో బాధపడుతున్న నా భార్యకు మందులు అయిపోయాయి.
ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. యజమాని ఇచ్చిన కూలి డబ్బులు సరిపోలేదు. నన్ను ఈ రకంగా ఆదుకున్నవా. నువ్వు ఉన్నావయ్య.. అంటూ ఆకాశంలోకి నమస్కరిస్తూ బిగ్గరగా అన్నాడు. అది చూసిన పిల్లాడికి కన్నీళ్లు ఆగలేదు. తండ్రి కొడుకుని అడిగాడు ఏమైంది రా అని, నాన్న మనం అతని బూట్లు తీసుకుని ఉంటే ఎంతో బాధ పడేవాడు. తీసుకునే దానితో వచ్చే ఆనందం కంటే ఇవ్వడం లో వచ్చే సంతోషం ఎంతో గొప్పది.
No comments:
Post a Comment