భళా పద్మావతి
ఎవరు ఏమన్నా సంజయ్ లీల బన్సాలి చిత్రం కనులకి ఇంపుగా తెర మీద ఘనంగా ఉంటుందని అది చూద్దామని బయలుదేరిన నాకు పద్మావతీ చిత్రం రాజపుత్రులు గగ్గోలు పెట్టినంత అభ్యంతరకర సన్నివేశాలు ఆ చిత్రం లో మచ్చుకైనా కానరాలేదు. బహుసా వాటిని సెన్సార్ వారు మొదట్లో నే కత్తెర వేసారేమో మరి.
ఇక కధ దాదాపుగా అందరికి తెలిసిందే ఒక రాజపుత్ర మహారాణి అయిన పద్మావతి మీద మొహం తగో చిత్తోడ్ రాజ్యం మీదకి దండెత్తుతాడు అలాఉద్దీన్ ఖిల్జీ మొదటి పర్యాయం వంచన తో మైత్రి హస్తం చూపించి రాజా రావన్ సింగ్ ని బందించి అతని ని వదిలేందుకు రాణి పద్మావతి ఢిల్లీ రావాలి అని షరతు పెడతాడు అయితే రాణి పద్మావతీ తాను కొన్ని షరతులు తో ఢిల్లీ వెళ్లి అతి చాకచక్యంగా రాజు ని కాపాడుతుంది.
ఇహ రెండవ సారి రెట్టింపు బలగం తో దాడి చేసి వంచన తో రాజు ని చంపి పద్మావతీ చేజిక్కించుకునే విఫల యత్నం చేస్తాడు ఖిల్జీ అతని ఎత్తుగడ సాగానీయక చిత్తోడ్ స్త్రీ జనం మొత్తం రాణి పద్మావతి తో కలిసి "జోహర్"అనే రాజపుత్రులు క్రమం అనుసరించి అగ్ని కి ఆహుతి అవుతారు.
రాణి పద్మావతి గా దీపికా పదుకునే అద్భుతమైన అభినయం చుపించింది, అలాఉద్దీన్ ఖిల్జీ గా భీకర ప్రతినాయకుడు పాత్ర లో రణవీర్ చక్కగా మెప్పించాడు.సంజాయ్ లీల బన్సాలి గారి యాడ్భూతమైన స్క్రీన్ప్లే తెర మీద రంగులు కన్నులపండుగా చేశాయి సంభాషణలు సంగీతం కూడా ఎంతో చక్కగా అమరాయి సినేమా కి అలంకారం చివరి ఘట్టం లో రాజపుత్ర స్త్రీల "జోహర్" క్రతువు చిత్రీకరించిన వవునం ఆ సన్నివేశం లో నటించిన స్త్రీ ముర్తులు బారి అభినయం ఎంతో అభినందించాలి అందరూ తప్పక చూడదగిన చిత్రం పద్మావతి
Saturday, 5 May 2018
భళా పద్మావతి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment