బాలక్రిష్ణకి శస్త్రచికిత్స విజయవంతం
రొటేటర్ కఫ్ టియర్స్ ఆఫ్ షోల్డర్ సమస్యతో బాధపడుతున్న బాలక్రిష్ణ
గంటపాటు కొనసాగిన శస్త్రచికిత్స
ప్రముఖ సినీనటుడు బాలక్రిష్ణ కుడిభుజంకి శనివారం ఉదయం కాంటినెంటల్ హాస్పిటల్ లో మేజర్ సర్జరీ జరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ లో గాయాలకు గురైన ఆయన రొటేటర్ కఫ్ టియర్స్ ఆఫ్ షోల్డర్ సమస్యతో బాధపడుతున్నారు. అప్పట్లో ప్రాథమిక చికిత్స తీసుకున్న ఆయనకు మేజర్ సర్జరీ నిర్వహించాలని వైద్యులు తేల్చారు. అయినప్పటికీ ఆయన జైసింహా చిత్రం షూటింగ్ సందర్భంగా బిజీబిజీగా ఉండిపోయారు. దీంతో ఈ సర్జరీ చేసుకోలేకపోయారు. ఈ నొప్పి రోజురోజుకి తీవ్రమవడంతో సర్జరీ అనివార్యమయ్యింది. ఈ సర్జరీ చేసుకోవడానికి బాలక్రిష్ణ శనివారం ఉదయం కాంటినెంటల్ హాస్పిటల్ కి ఉదయం ఎనిమిదిన్నగంటలకు చేరుకున్నారు. వెంటనే కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే) ఆయన కుడిచేయికి సర్జరీ చేసింది. గంటసేపు జరిగిన ఈ సర్జరీ విజయవంతమైందని వైద్యులు తెలిపారు.
Saturday, 5 May 2018
బాలక్రిష్ణకి శస్త్రచికిత్స విజయవంతం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment