!!!!! కుంకుమ / తిలక ధారణ - ప్రాముఖ్యత , వైశిష్ట్యం !!!!!
కుంకుమ ధరించడంలో ఉన్న ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు ఖచ్చితంగా రోజూ కుంకుమ ధరిస్తారు:
హిందూ ధర్మంలో సింధూరానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు....
ప్రతి రోజు శుచిగా స్నానం చేసి కుంకుమ ధరించిన తర్వాతే తమ రోజును ప్రారంభించే వారు చాలా మంది ఉన్నారు... ఇది తర తరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం... కానీ చాలా మందికి ఇది ఒక తంతులా ఉంది కానీ దీనిలోని పరమార్థం తెలియదు... అందుకే సింధూరం/కుంకుమ ధరించడం వలన మనకు జరిగే మేలు తెలిస్తే దానిని ఇంకొంచెం ఆసక్తి గా భక్తిగా ధరిస్తారనే సదుద్దేశ్యంతో ఉంచినదే ఈ పోస్ట్...
శరీరంలోని ప్రతి అవయవానికి అధిపతి ఒక్కో దేవత ఉంటారు. అలాగే లలాటానికి(నుదురు) అధిదేవత బ్రహ్మదేవుడు. మనిషి శరీరంలోని నుదురు భాగం (రెండు కనుబొమ్మల మధ్య భాగం) బ్రహ్మ స్థానం. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన లలాటంలో ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలి. ఇంకా లలాటాన్ని సూర్యకిరణాలు తాకరాదు. అందుకొరకు కూడా కుంకుమను నుదుట ధరించాలి. -
ఇక కుంకుమను ఏ వేలితో పెట్టుకోవాలి అనే సంశయం చాలామందిలో ఉంటుంది. అయితే కుంకుమను ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కో ఫలితం కలుగుతుంది. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడివేలుతో ధరిస్తే ఆయువు సమృద్ధి చెందుతుంది. బొటన వెలితో ధరిస్తే శక్తి కలుగుతుంది. చూపుడు వేలితో ధరిస్తే భక్తీ, ముక్తీ కలుగుతాయి.
ప్లాస్టిక్ బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం కన్నా మేలు రకం కుంకుమ ధరిస్తే అది క్రిమి సంహారకముగా కూడా పనిచేస్తుంది అందుకే కుంకుమను రోజూ ధరించండి. నుదుటన కుంకుమ అద్దితే జ్ఞానచక్రాన్ని పూజించినట్లు అవుతుంది. అందం, అలంకరణలో భాగం మాత్రమే కాదు ఇవన్నీ కుంకుమధారణ వెనుక ఉన్న అంశాలు.
నాడులు కలిసే కీలక ప్రదేశంలో...
మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నాడులు సక్రమంగా పనిచేయాలి. శరీరంలో రెండు ముఖ్యమైన నాడులు వుంటాయి. వాటిలో ఒకటి ‘ఇడ’ రెండోది ‘పింగళ’. ఈ రెండు నాడులూ నుదుటి వద్ద కలుస్తాయి. అంటే శరీరంలోని నాడులన్నింటికీ అనుసంధానం నుదుటన వుందన్నమాట. ఈ ప్రదేశాన్ని ‘సుషుమ్న’ నాడిగా పిలుస్తారు. ఇక్కడ కుంకుమగానీ, గంధం గానీ, విభూదిగానీ ధరించడం వల్ల నాడుల పనితీరు సక్రమంగా వుంటుందన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే కుంకుమ ధరించడం వల్ల దృష్టిదోషం తగలదట. కుంకుమ ధరించిన వ్యక్తులకు ఎదుటి వ్యక్తులు మానసికంగా లొంగిపోతారట. అలాగే కుంకుమకున్న ఎర్రటి రంగు మనలో మనోశక్తి, త్యాగనిరతి, నిర్భయత్వం, పరోపకార గుణాన్ని పెంపొందిస్తాయన్న అభిప్రాయాలు వున్నాయి.కుంకుమ వలన కోపం, ఆవేశం, చపలత్వం లాంటివి తగ్గి మనో నియంత్రణ సాధ్యమవుతుందని ఒక విశ్వాసం!!
Saturday, 5 May 2018
కుంకుమ / తిలక ధారణ - ప్రాముఖ్యత , వైశిష్ట్యం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment