Saturday, 5 May 2018

అతిలోక సుందరి అతే కొంపముంచిందా..?

అతిలోక సుందరి అతే కొంపముంచిందా..?

ఎప్పటికీ శ్రీదేవిని మించిన అందాలరాశి తెలుగు ఇండస్ట్రీలోలేదు. అప్పటికే బాలీవుడ్‌కు వెళ్లిపోయి నెంబర్‌వన్‌ హీరోయిన్‌ అయ్యింది. ఇక మెగాస్టార్‌తో నటించిన జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమా సూపర్‌హిట్‌ అయ్యేసరికి. ఆ తర్వాత ఆమెకు జాతీయస్థాయిలో గుర్తింపు పెరిగింది

ఇక ఆశ్చర్యం అనే పదం ఎందుకు వాడానంటే.. శ్రీదేవి తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో నటించింది. వారితో నటించి వారి నుంచి ఎంతో నేర్చుకొంది..కొత్త నీరు వస్తే పాత నీరు తప్పుకోవాల్సిందే. కానీ ఇక్కడ శ్రీదేవికి ఉన్న అతి జాగ్రత్త ఆమెను జీవితాంతం వేధిస్తూనే ఉంది. సాటి హీరోయిన్ల రాకతో పోటీ పెరిగి అందానికి మెరుగులు దిద్దుకోవడం నేర్చుకుంది.కోటేరు ముక్కు కోసం సర్జరీ, పళ్లు ఎత్తుగా కన్పించకుండా ఉండేందుకు సర్జరీ.. ఇలా ప్రతీదానికి వేరే వాళ్లతో పోటీ పెట్టుకుందా.. తనకు తానే తెలీకుండా ఒక మాయా వలయంలో చిక్కుకుపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతకాలం.. కొత్తగా వచ్చిన ప్రతీ హీరోయిన్‌తో పోటీ కోసం తాపత్రయ పడుతూనే ఉంది. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత కూడా అదే పరిస్థితి. మొదట్లో రేఖ, ఆ తర్వాత జయప్రద, ఆ తర్వాత మాధురీ.. ఇలా ప్రతీ ఒక్కరితో పోటీ పడుతూ అందానికి సర్జరీలు చేయించుకుంటూ ఇబ్బందులు పడుతూనే ఉంది.

శ్రీదేవి జీవితానికి, పాప్‌ సింగక్‌ మైఖేల్‌ జాక్సన్‌ జీవితానికిీ చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇద్దరూ ఒకే టైప్‌ మెంటాలిటీ ఉన్నవాళ్లు. కాలం, కాలంతో పాటు వచ్చే మార్పుల్ని స్వాగతించలేనివాళ్లు. ముఖంపై చిన్న మడత వస్తే తట్టుకోలేని వీళ్లిద్దరి జీవితాంతం సర్జరీలతో కాలం గడిపారు. స్లిమ్ముగా ఉండడం కోసం అన్నం మానేసి ట్యాబ్లెట్లతోనే కాలం గడిపారు. మైఖెేల్‌ జాక్సన్‌ పోస్ట్‌మార్టమ్‌ చేసిన డాక్టర్‌ రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌లో ఏముందో తెలుసా... ఆయన కడుపులో సరిగ్గా అరిగీ అరగని విటమిన్‌ ట్యాబ్లెట్లు చాలా ఉన్నాయని.
ఏదో సాధించాలని అతి తపన, ఆ తపనలో సరిగ్గా తిన్నామా, పడుకున్నామా అని పట్టించుకోకుండా పరుగుపెట్టాడు.
చివరకు ఓ రోజు రాత్రి గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు శ్రీదేవి కూడా అంతే.

రీసెంట్‌గా వారం రోజుల క్రితం ఓ ఫంకన్‌కు వచ్చింది. అందులో ఆమెను చూసిన వాళ్లంతా షాక్‌ అయ్యారు
చాలా సన్నగా, పీలగా ఉంది. అలా ఉండడాన్ని ఆమె అందం అనుకుంది. చూసినవాళ్లు ఈమెకు ఏదో జరుగుతుంది అనుకున్నారు.
అలా మనసులో అనుకున్నది మర్చిపోయేలోపే.. మన అందర్ని మర్చిపోయి ఆమె వెళ్లిపోయింది. రామ్‌గోపాల్‌ వర్మ చెప్పినట్లు... శ్రీదేవి అందం అనే వెలుగుని చాలామంది కళ్లల్లో, గుండెల్లోంచి ఆర్పేసి మరీ పట్టుకుపోయాడు దేవుడు.

మనిషికి అందం చాలా అవసరం. కానీ అందమే జీవితం కాదు. అందంతో పాటు ఆనందం అనేది ఒకటి ఉంటుందని చాలామంది మర్చిపోతున్నారు. అందులో శ్రీదేవి కూడా ఒకరు. శ్రీదేవి కంటే ముందు బాలీవుడ్‌కి వచ్చిన రేఖ ఇప్పటికీ ఎంతో చలాకీగా ఉంటారు.
ఆమె ముఖంపై ముడుతలు ఉంటాయి. ఫేస్‌లో గ్లో తగ్గింది. కానీ వాటన్నింటిని ఆమె తన నవ్వుతో జయిస్తారు. కానీ శ్రీదేవి అలా జయించలేకపోయింది. ఇంకా చిన్నపిల్లలానే కన్పించాలని ఆత్యాశ, ఆతృతతో తన వయసుని, వయసుతో వచ్చే మార్పుల్ని ఆహ్వానించలేకపోయింది. ఫలితం... అతిలోక సౌందర్యం... ఓ అర్థరాత్రి... అనంతలోకాలకు..వెడలిపోయింది.....By Unknown..

No comments:

Post a Comment