ఓదార్పుకు మించిన మందు లేదు......
జరిగిన సంఘటనతో మరోసారి రుజువైంది.
ఒక దంపతులకు లేక లేక ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను ఎంతో అల్లారుముద్దుగా
పెంచుకోసాగారు. కంటికి రెప్పవలే చూసుకునేవారు.
రెండుసంవత్సరాలు ఉన్న ఆ బాబు ఒకరోజు ఆడుకుంటూ ఉన్నాడు.పక్కనే
ఒక మందు సీసా ఉంది. దాని మూత తెరిచి ఉంది. అది ఆ బాబు తండ్రి గమనించి
తన భార్యతో ఆ సీసాను తీసి పెట్టు అని చెప్పి హడావిడిగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు.వంటచేయడంలో మునిగిపోయిన ఆ బాబు తల్లికి భర్త
మాట వినపడలేదు.
ఆడుకుంటున్న ఆ బిడ్డ ఆ మందు సీసాలోని మందును కొంచెం తాగాడు.
తీయగా ఉంటే పూర్తిగా తాగేశాడు. వంటపని ముగించుకుని వచ్చిన ఆ తల్లి
వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను చూసి వణుకుతున్న
చేతులతో బిడ్డను తీసుకుని ఏడుస్తూ హాస్పిటల్ కు వెళ్ళింది.
డాక్టరు బిడ్డను పరిశీలించి పెద్దవారు వాడుతున్న మందును పూర్తిగా త్రాగినందున బాబు చనిపోయాడని చెప్పేశారు. ఆ వార్త విన్న తల్లి తల్లడిల్లిపోయింది. బోరున విలపించసాగింది. కుటుంబ సభ్యులు ఎంత
ఓదార్చినా ఆ తల్లి కడుపుకోతను ఎవరూ తీర్చలేరుకదా! అదీకాక
తన భర్తకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక భయంతోనూ బాధతోనూ....
ఆ తల్లి తల్లడిల్లిపోయింది. విషయం తెలుసుకున్న ఆ తండ్రి పరుగుపరుగున
హాస్పిటల్ కు వచ్చి తన బాబును చూసి అప్పుడే నూరేళ్ళూ నిండిపోయాయా
నీకు చిన్నకన్నా! అంటూ ఏడవడం ఆరంభించాడు. తన భార్యను గుండెలకు
హత్తుకుని మనల్ని వదిలిపోయాడు మన బాబు అంటూ ఏడవసాగాడు.
తన నిర్లక్ష్యానికి తనని తిట్టిపోస్తాడెమో అని భయపడుతున్న తనను భర్త
ఇలా ఓదార్చడం చూసి భార్య విస్తుపోయింది. తనని తిడతాడేమో అని
భయపడిందని కుటుంబ సభ్యులు చెప్పగానే భార్యను దగ్గరకు తీసుకుని
" ఎవ్వరూ కావాలని తన బిడ్డను చంపుకోరు....ఇప్పుడు తనని తిడితే
పోయిన బిడ్డ తిరిగి వస్తాడా? రాడు కదా? అదీకాకుండా తనే నవమాసాలు
మోసి కన్నది.........నాకంటె పదింతల బాధ తల్లికి ఉంటుంది. నేను కూడా
మూర్ఖంగా ఆమెని తిట్టడం సమంజసమా? నేను తనకు ఆ మందు సీసాను
తీసిపెట్టమని చెప్పకుండా నేనే తీసి ఉండవచ్చుకదా! తనకు నేను ఉన్నాను
అని ధైర్యం చెప్పకుండా అవివేకంగా మాట్లాడటం సమంజసం కాదుకదా?
అంటూ.......ఏడుస్తున్న తన భార్యతో " నీకు నేనున్నాను. బాధపడకు.
బిడ్డ చనిపోవడం మన తప్పిదం......దేవుడి ని్ర్ణయం....నీకు నీ బిడ్డను
తిరిగి తీసుకురాలేను కానీ .నాకు నువ్వు నా బిడ్డతో సమానం. బాధపడకు."
అని అన్నాడు. భర్త తనని ఓదార్చడంతో తనని అర్థం చేసుకున్న భర్త
తనకు లభించినందుకు ఆ దేవునికి ధన్యవాదములు తెలిపింది మనసులోనే!
మిత్రులారా! ఇలాంటి పరిస్థితిలో నేరాన్ని ఇతరులపై నెట్టడం సరికాదు.
వారిని ఓదార్చండి.ఓదార్పుకుమించిన మందు లేదు కదా!
...................................విజయ.కె..........విజయపథం.
Saturday, 5 May 2018
ఓదార్పుకు మించిన మందు లేదు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment