Saturday, 5 May 2018

కుక్క

ఈరోజు ఉదయం మార్కెట్ కు వెళ్ళి నప్పుడు జరిగిన ఒక సంఘటన నన్ను చాలా కదిలించింది. ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనిపిస్తోంది. దయచేసి చదవండి.
మార్కెట్ సమీపంలో చెత్త ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఒక కుక్క ఆహారంకోసం

వెతుకుతూ ఆ చెత్త దగ్గర అటూ ఇటూ తిరుగుతోంది.ఆ కుక్కను ఆ వీధిలోనే

ఆడుకుంటున్న చిన్న పిల్లలు రాళ్ళతో కొట్టి తరుముతున్నారు. రాళ్ళు బలంగా తగిలి ఆ కుక్క బాధతో అరుస్తూనే ఏదో ఒక కవరును నోటకరచుకుని

కుంటుకుంటూ పక్క సందులోకి వెళ్ళింది,జాలితో రెండు బిస్కెట్ ప్యాకెట్లను తీసుకుని ఆ కుక్క వెళ్ళిన సందులోకి వెళ్ళాను. అక్కడి దృశ్యాన్ని చూసి నా కళ్ళల్లో కన్నీరు ఆగలేదంటే నమ్మండి, కుక్క కాలికి పెద్ద గాయమై రక్తం

కూడా వస్తోంది. అవేమీ పట్టించుకోకుండా ఆ కుక్క ఆ ఆహారమున్న

కవరుని తన పిల్లల ముందు ఉంచింది, ఆ కుక్కపిల్లలు ఆ ఆహారాన్ని

తింటుంటే ఆ తల్లి కుక్క తనకాలికి అయిన గాయాన్ని తన నాలుకతో

తుడుచుకుంటోంది. నిజంగా తల్లి ప్రేమకు సాటి మరొకటి ఉండదుకదా!
నేను తీసుకెళ్ళిన బిస్కెట్లను ఆ కుక్క ముందు ఉంచాను. తన పిల్లలు

తినేదాక ఉండి మిగిలిన ముక్కలను మాత్రమే ఆ కుక్క తిన్నది.
చిన్నపిల్లలు తెలియక కొట్టారే అనుకుందాం! కానీ చాలా మంది పెద్దవారు

కూడా నిష్కారణంగా దారిన పోయే మూగ జీవాలను కొడుతుంటారు.

వాటికీ మనకు ఉన్నట్లుగానే నొప్పి ఉంటుందిగా,వాటికి మనం సహాయం

చేయకపోగా వాటిని కొట్టి హింసించడం మంచి పనేనా???
మీ ఇంట్లో మిగిలిన పదార్థాలను మూగ జీవాలకు అందించండి. 

నిజంగా మీ ఇంటిముందు ఎంతో విశ్వాసంతో కాపలా కాస్తుంది.

అలా అని వీధికుక్కలని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలా? అని అడగకండి,

పదార్థాలను వృధా చేయకుండా మూగ జీవాలకు అందించడంలో

తప్పులేదు కదా! ఆలోచించండి.......విజయపథం..

No comments:

Post a Comment