Saturday, 5 May 2018

రూ. 49 చెల్లించండి, 28 రోజులు ఎంజాయ్ చేయండి - Reliance Jio phone Rs.49 plan



దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో యూజర్ల కోసం మరో ఆఫర్ తీసుకొచ్చింది. అయితే ఇది జియో యూజర్లకు మాత్రమే కాకుండా అందరికీ వర్తించేలా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే రూ. 49 ప్లాన్ ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను, 1జీబీ డేటాను వాడుకోవచ్చని పేర్కొంది.కాగా ఇంత చౌకైన రెంటల్‌ ప్లాన్‌ను మరే ఇతర కంపెనీ కూడా ఆఫర్‌ చేయడం లేదు. కానీ ఇది కేవలం జియోఫోన్‌ యూజర్లకేనని అధికారికంగా ప్రకటించడంతో, జియో వినియోగదారుల్లో కాస్త నిరాశవ్యక్తమైంది. ఆయితే కొన్ని ట్రిక్స్ పాటించడం ద్వారా ఈ ప్లాన్‌ను జియోసిమ్‌ వాడే ప్రతి ఒక్కరూ తమ సొంత ఫోన్లలో ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చని తెలిసింది.

ఇతర ఫోన్లలో కూడా వాడుకోవడానికి..


ఈ ప్లాన్లను ఇతర ఫోన్లలో కూడా వాడుకోవడానికి తొలుత మీ జియోసిమ్‌ను జియోఫోన్‌లో వేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం జియోఫోన్‌ ద్వారా ఈ ప్లాన్లను కొనుగోలు చేసి, యాక్టివేట్‌ చేసుకోవాలి

యాక్టివేట్‌ చేసుకున్న అనంతరం..


జియోఫోన్‌పై ఈ ఆఫర్లను యాక్టివేట్‌ చేసుకున్న అనంతరం, సిమ్‌ను బయటికి తీసి, మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌లో వేసుకోవాలి. కేవలం జియోఫోన్‌లో మాత్రమే ఈ ప్లాన్లను వాడుకోవాలనే నిబంధననేమీ లేదు.

జియో ఫోన్ యూజర్ల కోసం..


అయితే జియో ఫోన్ యూజర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రిలయన్స్‌ రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అవి రూ.153 ప్లాన్‌, రూ.49 ప్లాన్‌. నెల రోజుల వ్యాలిడితో వచ్చిన ఈ రెండు ప్లాన్లు మీ సొంత మొబైల్స్ లో వాడుకునే విధంగా కూడా అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment