Saturday, 5 May 2018

వాలెంటైన్స్ డే గురించి కొన్ని చేదు నిజాలు

???????????
❌❌❌❌❌❌❌❌

వాలెంటైన్స్ డే గురించి కొన్ని చేదు నిజాలు:

వాలెంటైన్స్ డే జరుపుకోవడం సాంస్కృతికపరంగా ఎంతవరకు సమంజసమో మనం తెలుసుకోవాలి.

ఫిబ్రవరి 14 ను వాలెంటైన్స్ డే గా కొన్ని దేశాలలో జరుపుకుంటారు. ఆరోజు యువతీ యువకులు పువ్వులను, మరియు బహుమతులను వారి ప్రేమకు చిహ్నంగా ఒకరికొకరు ఇచ్చుకుంటారు. నిజమైన ప్రేమకు ఈ ఆడంబరం అవసరమా? మరియు ఆ ప్రేమ కేవలం ఒక్కరోజుకు మాత్రమే పరిమితమా? తల్లి తండ్రులను ఓల్డ్ ఏజ్ హోంస్ లో పెట్టి మదర్స్ డే, ఫాదర్స్ డే అని పెట్టి ప్రేమను ఒక్కరోజుకే పరిమితం చేయడం పాశ్చాత్య సాంప్రదాయం. ఈనాడు ఈ వెర్రితనం గొప్ప సంస్కృతి/సాంప్రదాయాలు కలిగిన భారత దేశం లోకి కూడా వ్యాపించింది.

ప్రేమ అంటే కేవలం భౌతికపరమైన ఆకర్షణేనా? ప్రేమ అనేది అన్నీ గొప్ప బంధాలలో అంటే గురువు-శిష్యుని మధ్య, అన్నదమ్ములు-అక్కచెల్లెళ్ళ మధ్య, అమ్మ నాన్న మీద ఇంకా మాతృభూమి మీద కూడా ఉంటుంది. ఆనాటి యువ విప్లవకారులైన భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్,మదన్ లాల్ దింగ్రా మొదలగువారు యవ్వనంలో వారి జీవితాలను త్యాగం చేయకుండా, వాలెంటైన్స్ డే వంటివి జరుపుకుంటూ ఉంటే మనం ఈనాడు స్వాతంత్రాన్ని పొందేవారం కాదేమో !

సెయింట్(?) వాలెంటైన్ చరిత్ర:

పూర్వం రోము దేశలో విగ్రహారాధన ఉండేది. ఆ రోజుల్లో ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీ వరకు ఒక పండుగను జరుపుకునేవారు. ఎలా అయినా వారి సంస్కృతిని నాశనం చేయడానికి,, విగ్రహారాధన లేకుండా చేయడానికి పోప్ గలాసిస్ "వాలెంటైన్" ను ఫిబ్రవరి 14 వ తేదీతో ముడిపెట్టి, ఫిబ్రవరి 14వ తేదీని వాలెంటైన్స్ డేగా జరుపుకోవడం ఆచారంగా చేసాడు. అంటే 14 వ శతాబ్దం వరకు ప్రేమ కు, వాలేంటైన్స్ డేకు ఎటువంటి సంభంధం లేదు.

ఇంకొంతమంది ఏమి చెబుతారు అంటే, 3 శతాబ్దంలో రోము రాజు అయిన క్లాడియస్ తమ దేశ మీద జరిగే వరుస దాడులను ఎదురుకోవడానికి యువకులందరిని వివాహం చేసుకోకూడదని, సైన్యం లో చేరాలని ఆదేశిస్తాడు. అయితే వాలెంటైన్ అనే పూజారి ఈ అదేశాన్ని పట్టించుకోకుండా యువతీ యువకులకు రహస్యంగా వివాహాలు చేయిస్తాడు. దాంతో వాలేంటైన్ కు మరణ శిక్ష విధిస్తారు. అయితే అన్నీ పరిత్యజించి "సెయింట్" అని చెప్పుకుంటున్న వాలెంటైన్ జైలు అధికారి కుమార్తెను ప్రేమలో పడేస్తాడు. ఇటువంటి వారిని "సెయింట్" అనడం మరియు దానికొసం ఒక రోజు జరుపుకోవడం ఎంత వరకు సమంజసం?

వాలెంటైన్స్ డే జరుపుకోవడం వలన కలిగే నష్టాలు ఏమిటి?

1) శాస్త్రీయ పరంగా, సాంస్కృతికపరంగా వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఎటువంటి ఆధారం లేదు.
2) కళాశాలల్లో చదువుకునే యువతీ యువకులు గ్రీటింగు కార్డు లు ఇచ్చుకొని వారి ప్రేమను పంచుకొంటునట్టుగా భావిస్తారు. కాని వాస్తవానికి ఆ వయస్సులో అది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మాత్రమే !
3)ఎన్నో పాశ్చాత్య దేశాలు ఈ వాలెంటైన్స్ డేను జరుపుకోవడం మానేశాయి. రోమన్సె కాథోలిక్ సె యింట్ల కాలెండర్ 1969లో తయారు చేయబడింది. అప్పటినుంచి వాలెంటైన్స్ డేను కాలెండరు లోంచి తీశేశారు. వాళ్ళే నిషేధించినపుడు మనం ఎందుకు జరుపుకోవాలి?

యువకులను అందరిని ఐక్యం చేసి నిజమైన ప్రేమ అంటే ఏమిటో, నిజమైన ప్రేమలో దైవత్వాన్ని ఎలా చూడాలో వారికి చెప్పాలి. అంతే కాని ఒక్క రోజు ప్రేమికుల దినం గా జరుపుకుని ఆరోజు బహుమతులు ఇచ్చుకున్నంత మాత్రనా ప్రేమ ఉనట్టు కాదు. మనం ఒకటి ఆలొచించాలి. ప్రేమికుల రోజు పేరిట యువతీ యువకులు ఎక్కడ పడితే అక్కడ ఉంటే వారి తల్లి తండ్రులు ఎంత బాధపడుతారు? మరియు ఇంత గొప్ప సంస్కృతి కలిగిన భారతదేశంలో కూడా ఈ వాలెంటైన్స్ డే వంటి వాటిని జరుపుకుంటున్నాం అంటే ఎమిటి అర్థం? అలోచించండి. దేశం గురించి ధర్మం గురించి పిల్లలకు చెప్పల్సిన బాధ్యత మనది, మన పూర్వీకులు ఎంత గొప్పవారో, మన భారత దేశం సాస్కృతికపరం గా ఎంత గొప్పగా ఉండేదో, మన దేశ విలువలు సాంప్రదాయాలు ఏమిటో ఇవన్ని పిల్లలకు భోధించాలి. అనవసరమైన ఆకర్షణల నుండి వారి మనసును ఒక లక్ష్యం వైపు మళ్ళించాలి. దేశం, ధర్మం మీధ స్వాభిమానాన్ని పెంచాలి.
?????????

No comments:

Post a Comment