Saturday, 5 May 2018

షాకింగ్... మొబైల్ నంబర్స్ అన్ని మారిపోతాయి

న్యూఢిల్లీ: వినియోగదారులకు మరింత భద్రత కల్పించే విధంగా టెలీకం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మొత్తం సిమ్ ఆధారిత ఎం2ఎం (మెషీన్ టు మెషీన్) వినియోగదారులకు... 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని టెలీకం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 10 అంకెల ఫోన్ నంబర్ వాడుతున్న వినియోగదారులు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 13 అంకెల నంబరుకు పోర్టబుల్ చేసుకోవాలి. డిసెంబర్ 31 నాటికల్లా పోర్టబులిటీ గడువు ముగుస్తుంది.

కాగా జనవరి 8 నాటికే దీనిపై టెలీకం శాఖ నుంచి తమకు ఆదేశాలు అందాయనీ... దానిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని బీఎస్ఎన్ఎన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ఈ ఏడాది జూలై 1 నుంచి 13 అంకెల ఎం2ఎం నంబర్ విధానాన్ని అమలు చేయాలని టెలీకం శాఖ నిర్ణయించింది. ఆరోజు నుంచి కొత్తగా తీసుకునే అన్ని మొబైల్ ఫోన్ నంబర్లలో 13 అంకెలు ఉంటాయి. ఇప్పటికే 10 అంకెల నంబర్‌ వాడుతున్న వినియోగదారులు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31లోపు కొత్త నంబర్‌కు మారాల్సి ఉంటుంది...’’ అని వెల్లడించారు.

మరోవైపు ఇదే విషయాన్ని టెలీకం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ధ్రువీకరించింది. ‘మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్‌లో స్పెక్ట్రమ్, రోమింగ్, క్యూవోఎస్‌కు సంబంధించి’ టెలీకం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు లిఖిత పూర్వకంగా స్పందన తెలిపింది. టెలీకం శాఖ సిమ్ ఆధారిత ఎం2ఎం డివైజ్‌ల కోసం 13 అంకెల నంబరింగ్ సిరీస్‌ను ఆమోదించిందనీ.. ఇప్పటికే చలామణీలో ఉన్న 10 అంకెల నంబర్‌తో పాటు పనిచేసే విధంగా కొత్త నంబరింగ్ విధానం ఉంటుందని వెల్లడించింది.

No comments:

Post a Comment