దేశంలో తొలి మహిళా రైల్వే స్టేషన్
.
రాజస్థాన్‌లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్లో అంతా మహిళలే. టీసీ, ఆర్పీఎఫ్, రిజర్వేషన్ అండ్ బుకింగ్ సూపర్ వైజర్స్.. ఇలా మొత్తం 32పోస్టుల్లో మహిళా ఉద్యోగిణులే. అంతేగాక, మహిళా ఉద్యోగిణులే ఉన్న దేశంలోని తొలి రైల్వే స్టేషన్‌గా ఈ రైల్వే స్టేషన్ రికార్డుల్లోకి ఎక్కింది. మహిళా ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తూ భారతీయ రైల్వే శాఖ అందర్నీ మహిళా ఉద్యోగులనే ఎంపిక చేసిందని రైల్వే ప్రతినిధి తరుణ్ జైన్ తెలిపారు.
.
కాగా, ఈ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళలంతా ఉన్నత శిక్షణ పొందడం గమనార్హం. ఈ రైల్వే స్టేషన్ మీదుగా జైపూర్-ఢిల్లీ వంటి ప్రధాన రైలు మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. రోజూ ఈ స్టేషన్ మీదుగా 50రైళ్లు వెళ్తుంటాయి. వీటిలో 25 రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగుతాయి.
.
కాగా, రోజు దాదాపు 7వేల మంది ప్రయాణిస్తుంటారు. మహిళల సౌకర్యార్థం ఈ స్టేషన్లో సీసీటీవీలు, శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేశారు. ఈ తరహా రైల్వే స్టేషన్లు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది.
Saturday, 5 May 2018
దేశంలో తొలి మహిళా రైల్వే స్టేషన్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment