Saturday, 5 May 2018

సాంకేతికంగా గ్రహాల ప్రభావం మన మీద ఉంటుందా?

సాంకేతికంగా గ్రహాల ప్రభావం మన మీద ఉంటుందా?

మనకు సముద్రంలో అలలు, ఆటుపోట్లు ఎందుకు వస్తాయి అన్న తర్కం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం. చంద్రుని గురుత్వాకర్షణశక్తి దానికి కారణం. పున్నమి, అమావాస్యలలో ఆటుపోట్లు వస్తాయి అని కూడా మనకు తెలుసు. సముద్రం అంత పెద్ద జలాశయాన్ని, దానికున్న సహజ అలల లక్షణాన్ని ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో వున్న చంద్రుడు నిర్దేశించగలుగుతున్నాడు అన్నది నిరూపితమైన సత్యం. అలాగే మనకు ఈ మధ్య తెలిసిన విషయం మన కేంద్ర నాడీ వ్యవస్థ మన దేహంలో వున్న భాగాలను ప్రేరేపించదానికి వాటిచేత పని చేయించడానికి నిరంతరం విద్యుత్ ప్రచోదనాలు పంపుతుంది. అలాగే మన మనస్సు తన ఆలోచనలను తరంగాల రూపంలో తయారు చేసుకుంటుంది. అంత పెద్ద నిర్మాణమైన సముద్రాన్ని ప్రేరేపించగల శక్తి వున్న చంద్రుడు మన మనస్సును, దానిలోని తరంగాలను శృతి చేస్తుంది అన్న విషయం తార్కికమే కదా. అందుకే కొంత పిచ్చి ఉన్న వారికి పున్నమి అమావాస్యలలో విపరీత పోకడలు కనబడతాయి అన్నది ఒప్పుకున్న సత్యం. అందుకే వారిని లునటిక్స్ (Lunatics) అంటారు. Lunar (చంద్ర) సంబంధిత వ్యాధి కాబట్టి వారికి ఆ పేరు పెట్టారు. ఇదే మన పురుషసూక్తంలో “చంద్రమా మనసో జాత:” అని ఎప్పుడో చెప్పబడి వుంది. చంద్రుడు మన: కారకుడు అని. అలాగే మన భూగోళానికి దగ్గరగా ఉన్న ఇతర గ్రహాలూ, సూర్యుడు మన జీవనాన్ని శాసిస్తారు.
మరొక కొత్త వాదం బయలుదేరింది ఈ మధ్య. రాహు కేతువులు అని మనవాళ్ళు మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తున్నారు అని. అసలు వాటిని మన శాస్త్రంలో ఛాయాగ్రహాలు అని పిలుస్తారు. చంద్రుని, మరి సూర్యుని పరస్పర ప్రభావాలు కేవలం వాటిని ప్రత్యేకంగా తీసుకుంటే పూర్తి కావు. ఒకదానికి మరొక దాని పై వున్న సంబంధాన్ని గణిత లెక్కల కోసం మరొక రెండు గ్రహాలు వున్నాయని వాటికి శరీరం లేదని వాటినే రాహు కేతువులు అని నామకరణం చేసారు. వాటి ప్రభావం నిరంతరం వుంటుంది కానీ కేవలం గ్రహణాలు వచ్చినప్పుడు మాత్రమె కాదు. అసలు మనం రోజు ఎన్నో గ్రహాల ప్రభావానికి లోనవుతాము. దానినే నేటి mathematical సమీకరణం గా తీసుకుంటే :

F(Sun, moon, mars, Jupiter, Saturn, mercury, venus) =
A0*G1(sun + d1t) + B0 * G2(Moon + d2t ) + AB0 * G3 ( Sun – moon* d3t ) + AB1 ( moon – Sun*d4t ) + C0 * G4( mars + d5t) + D0 * G5 (mercury + d6t) +….
G1(sun + d1t) – అంటే సూర్యుని ప్రభావం వున్న function. అది ఉచ్చంలో ఉందంటే A0 దాని ప్రభావం సానుకూలంగా గుణిస్తుంది. లేదా విభజిస్తుంది.
G3, G4 లు – సూర్య చంద్ర సంక్లిష్ట ప్రతిచర్యలు ( complex interactions).
ఒకడి పుట్టిన సమయాన్ని బట్టి ఈ పై సమీకరణంలో కొన్ని కూడికలు అవుతాయి, కొన్ని తీసివేతలు అవుతాయి. కొన్ని సమయాన్ని బట్టి మారుతాయి. అందుకే జాతకం లో కొందరికి శని ఉచ్చంలో ఉన్నాడు అంటారు, కొందరికి నీచంలో ఉన్నాడని ఇతరత్రా విషయాలు వింటూ ఉంటాము. ఇదంతా పూర్తిగా శాస్త్రీయ బద్ధమైన గణిత శాస్త్ర తర్కం. ఇక్కడ ఎన్నో variables వున్నాయి. వాడు పుట్టిన స్థల, సమయ రీత్యా చాలా మార్పులు వుంటాయి. ఇటువంటి ఒక సమీకరణాన్ని మనం పరిష్కరించాలంటే గణితంలోనే ఎంతో కష్టతరమైన విషయం.

గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తమ కక్ష్యలో తిరుగుతున్నాయి. ఒకోక్కదాని బరువు ఎన్నో లక్షల కిలోలు. వాటికి ఉన్న specific gravity వలన వాటికి తమ బరువుకు తగ్గ అయస్కాంత శక్తి వున్నాయి. ఇక్కడ మన భూమికి దగ్గరగా వున్న సౌర కుటుంబం లో ఉన్న అన్ని భారమైన ఖగోళ వస్తువులను పరిగణిస్తారు. ఉదాహరణకు చంద్రుడు, సూర్యుడు గ్రహాలు కావు కానీ వాటి ప్రభావం మన మీద వుంటుంది కావున వాటిని మనం గ్రహాలగా లెక్కిస్తాము.
ఒక బరువైన వస్తువు మరొక బరువైన వస్తువుకు మధ్య కొంత అయస్కాంత శక్తి వుంటుంది. ఇవన్నీ సమపాళ్లలో ఉండడం చేతనే ఈ గ్రహాలన్నీ తమ తమ కక్ష్యలలో తిరుగుతున్నాయి. లేకపోతె ఒకదానికి మరొకటి గుద్దుకొని ఎప్పుడో పూర్తి ప్రళయం సంభవించి ఉండేది. పరస్పర ఆకర్షణశక్తి, స్వయం గురుత్వాకర్షణ శక్తి కారణంగా అవి తమ కక్ష్యలలో తిరగ గలుగుతున్నాయి. ఈ విషయం భాస్కరాచార్యుడు “లీలా గణితం” లో విపులీకరించాడు.
ఒకొక్క గ్రహం యొక్క బరువు , మరొక గ్రహానికున్న దూరాన్ని ఆధారం చేసుకుని మనం వాటి మధ్య ఆకర్షణ శక్తిని గణిస్తాము.
F = G * m1 * m2 / (r * r)
దీని ప్రకారం సూర్యునికి భూమికి ఉన్న ఆకర్షణ శక్తిని ఈ విధంగా గణిస్తే:
5.97*10^24 kg * 1.99*10^30 kg / (149,668,992,000 * 149,668,992,000 ) = 3.54E+24 Newton అంత శక్తి వున్నది.
మిగిలిన గ్రహాలకు భూమికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి లెక్క కడితే ఈ విధంగా వస్తుంది.
Earth and Sun – 3.54E+24 Newton; Earth and moon – 1.98E+20 Newton; Earth and mercury – 1.5565E+16 Newton; Earth and venus – 1.13 E+19 N; Earth and Mars – 4.15 E+17N; Earth and Jupiter – 1.9E+18N; Earth and Saturn – 1.397 E +17N.
అలాగే మనం లేక్కించని కొన్ని గ్రహాలకు చూసునప్పుడు వీటికన్నా చాలా తక్కువ ఆకర్షణ శక్తి వుంటుంది. కావున వీటిని మనం పరిగణలోకి తీసుకోలేదు. Earth and Uranus – 1.8E+14N; Earth and Neptune – 3.84E+14N

అలాగే భూమికి సూర్యునికి ఉన్న శక్తి కన్నా సూర్యునికి చంద్రునికి వున్న గురుత్వాకకర్షణ శక్తి పోల్చదగినదిగా వుంటుంది. అలాగే ఇక్కడ కింద చూపిన విధంగా చంద్రుని కక్ష్య సూర్యుని చుట్టూ 12 పీక్స్ మరి 12 త్రఫ్స్ లాగా కనిపిస్తుంది. కాబట్టి వాటి మధ్య ఉన్న శక్తి విలువ నిరంతరం మారుతూ వుంటుంది. దీన్నే మనం రాహు కేతువుల గా గుర్తించి వాటిని కూడా గణిస్తాము. వీటి ప్రభావము పూర్తిగా చంద్ర, సూర్యగ్రహణాల సమయంలో ఆ ప్రదేశంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఎవరి ఎవరి జాతక చక్రంలో వారు ఏ సమయానికి పుట్టారో అన్నదానిని బట్టి వారి మీద ఆ శక్తి ప్రచోదనం వేరేగా వుంటుంది. అందుకే గ్రహణప్రభావాలు ఒకొక్కరి మీద ఒకొక్క రకంగా వుంటాయి. ఇవన్నీ కూడాను శాస్త్రీయంగా ఆ గ్రహమైత్రి అనుబంధాలను అధ్యయనం చేసినవారికి లోతుగా తెలుస్తాయి.

ఈ గ్రహణప్రభావాలు ఈ రాశిలో పుట్టినవారికి ఇలా ఉండే అవకాశం మెండు అని చెబుతారు. వాటిపై వారి పూర్వ కర్మ ప్రభావం వలన అవి ఎక్కువ అవ్వవచ్చు, లేదా తక్కువ ప్రభావం చూపవచ్చు. మొత్తం ప్రోబబిలిటీ ప్రకారం చూసుకుంటే 1/12 మాత్రమె జరగకపోవడానికి అవకాశం వుంది. అందులోను పాదాలను లెక్క వేసుకుని, వారి జాతక చక్రం ప్రకారం వారి కర్మ ఎటువంటి ప్రభావం చూపగలదో చూసుకుంటే 92% జరగగలిగే అవకాశం వుంది కాబట్టి చెప్పిన శాంతులు దానాలు పరిహారాలు చేసుకోవడం వలన మనకు వచ్చే అవకాశం ఉన్న ఆపదల నుండి రక్షణ దొరుకుతుంది.
నేటి సైన్సు ఇప్పటి రీసెర్చ్ కి అనుగుణంగా ఉన్న విషయాన్ని ధృవీకరిస్తుంది. ద్రువీకరించనిది తప్పని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. నీకు నమ్మకం ఉందా చెయ్యి బాగు పడు, లేదా అడ్డగాడిదలా అందరినీ చెడగొట్టకు. ఒకసారి ఇలాంటి వితండవాదే శంకరాచార్యుని ఇతిమిద్ధంగా నిరూపణకానివాటిని ఎందుకు పాటించాలి అంటే ఎప్పుడో నిరూపణ అయ్యి అయ్యో నేను అలా చేసుకుంటే బాగుపడేవాడిని అని బాధపడనవసరం లేకుండా నాకు పెద్దలు ఋషులు చెప్పిన విషయాలను నమ్మి పాటిస్తే వచ్చే నష్టం ఏమి లేదు కదా అన్నారు. ఆయన కన్నా గొప్పవారమా మనం???????

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

No comments:

Post a Comment