గ్రహణం సమయంలో గరిక/దర్భ ను ఉపమోగించడం వెనుక సైంటిఫిక్ నిజం.
భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే రేఖపై రావడం వలన సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి ఉండడం వలన భూమి నీడ చంద్రునిపై పడి మనకు కనిపించడు... దీనినే చంద్ర గ్రహణం అంటాము.. ఇది సంవత్సరంలో ఒక సారి సంభవించవచ్చు... అయితే ఈ గ్రహణ సమయంలోనూ అటు చంద్రుడు ఇటు భూమి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ గ్రహణ సమయంలో భూమి మీదకు కొన్ని రకాల ప్రమాదకర కిరణాలు(అతినీలలోహిత కిరణాలలాంటివి)ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది...
అందుకే ఈ సమయంలో ఏ పనీ చేయకూడదని, చివరికి ఆహార పదార్థాలతో సహా ఏదీ ముట్ట కూడదని మన పెద్దలు ఆచార సాంప్రదాయాలలో ఉంచారు... దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు... తర్వాత ఆలయాలన్నీ/గృహాలు సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావం తొలగించడానికే... ఈ విషయాలు సామాన్య జనబాహుళ్యానికి కూడా అర్థమయ్యే విధంగా గ్రహణకాలనిబంధనలను చాలా ఖచ్చితంగా అమలుచేసేవారు మన పెద్దలు.... గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగి ఉన్నది.. అందుకే మన ఇంటిలో అన్ని పాత్రలపై మరియు నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని... గరికను ఎక్కువగా ఉపయోగించమన్నారు పెద్దలు... ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది.?
Saturday, 5 May 2018
గ్రహణం సమయంలో గరిక/దర్భ ను ఉపమోగించడం వెనుక సైంటిఫిక్ నిజం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment