Saturday, 5 May 2018

Budget -2018-19

ప్రతి పేదవానికి 5 లక్షల ఆరోగ్య భీమా..
రైతులకి పెంచిన కనీస మద్దతు ధర..
ఇలా దేశ ఆర్థిక బడ్జెట్ పక్కా రైతు బడ్జెట్ లా బాగుంది,

1. ఆరోగ్య భద్రత ద్వారా లబ్ధిపొందేవారు 50 కోట్ల మంది
2. ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందేది 8 కోట్ల మంది
3. ఉచిత విద్యుత్ కనెక్షన్లు 4 కోట్ల మంది పేదలకు
4. రైతులకోసం 42 మెగా ఫుడ్ పార్కులు.
5. వ్యవసాయాధారిత ఉత్పత్తుల కంపెనీలకు 100 కోట్ల టర్నోవర్ వరకూ 100 పన్ను రాయితీ.
6. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు 1400 వందల కోట్లు.
7. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 51 లక్షల ఇళ్ళు నిర్మాణం.

ఇంతకంటే ఇంకేం కావాలి ఈ బడ్జట్ సామాన్యుల కోసం కాదా ఆని..??

దేశంలోని పేదల ఆరోగ్యంపై సంచలన నిర్ణయం:
నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నది. ఈ పథకం ద్వారా 10 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. 50 కోట్ల మందికి ప్రత్యేక్షంగా ఈ పథకం కిందకి వస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యే పేదలకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా వస్తోంది. ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా వర్తించేలా ఈ పథకం పని చేస్తుందన్నారు. దీని కోసం ఒక్కో కుటుంబం ఏడాదికి కేవలం రూ.330 చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన పూర్తి ఆరోగ్య బీమా పథకం ఇది. ఆస్పత్రుల బిల్లులు కట్టలేక.. అప్పులు పాలయ్యే బాధ తప్పుతుందన్నారు అరుణ్ జైట్లీ. ప్రతి పేద వ్యక్తి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అన్నారు అరుణ్ జైట్లీ..

ప్రతీ బ్యాంక్ లో దీనికి అప్లికేషన్లు ఉంటున్నాయి అవి తీసుకొని ఫిల్ చేసి ఇవ్వటమే ప్రతీ సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్ నుండి Rs 330 కట్ అవుతాయి.

కేంద్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌:
మొత్తం బడ్జెట్‌ రూ.21.57లక్షల కోట్లు
ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతం
వచ్చే ఏడాదికి 3.3కు తగ్గుతుందని అంచనా.

వ్యవసాయం, గ్రామీణం, సంక్షేమం:
ఈ బడ్జెట్‌లో వ్యవసాయంతోపాటు, గ్రామీణరంగం, సంక్షేమ రంగంపై దృష్టి.
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి రంగానికి అత్యధిక రూ.14.34లక్షల కోట్లు
రైతు సంక్షేమానికి కట్టుబడి, రైతుల ఆదాయం పెంచేందుకు దృష్టి.

నేషనల్‌ బ్యాంబూ మెషిన్‌కు రూ.1200 కోట్లు
వెదురు పరిశ్రమకు, ఆర్గానిక్‌ వ్యవసాయాన్నికి, సౌర విద్యుత్‌కి ప్రోత్సాహకాలు..

వ్యవసాయ మార్కెట్‌ల అభివృద్ధికి రూ.2000 కోట్లు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్లు
ఫుడ్‌ ఫ్రాసెసింగ్‌ కోసం 42 కేంద్రాలు ఏర్పాటు
ఆర్గానిక్‌ వ్యవసాయానికి కేంద్రం తోడ్పాటు.
వ్యవసాయ ఎగుమతులను సరళీకృతం.
పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు ఉండేలా మద్ధతు ధర.
పంట కొనే విషయంలో రాష్ట్రాలతో మాట్లాడి ఓ వ్యవస్థ ఏర్పాటు

ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.లక్షా 5వేల కోట్లు
కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చేలా కొత్త విధానం
వచ్చే ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు
దిగువ తరగతి వారికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 50 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం.

ఉజ్వల పథకం కింద 8 కోట్ల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు
ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు రూ.1600 కోట్లు
సాగునీటి కోసం నాబార్డుతో కలిసి ప్రత్యేక విధానం
చేపల పెంపకం, పశుసంవర్థకానికి రూ.10వేల కోట్లు

జాలర్లకు క్రెడిట్‌ కార్డులు
ఆపరేషన్‌ గ్రీన్‌కు రూ.500 కోట్లు
ప్రభుత్వం ఇచ్చే ఏ ప్రయోజనం అయినా నేరుగా ప్రజల ఖాతాల్లోనే.

ఎస్టీలకు రూ.39,115 కోట్లు కేటాయింపు
ఎస్సీలకు రూ.56,619కోట్లు కేటాయింపు
పేద, మధ్యతరగతి వర్గాలు హాయిగా బతికేందుకు కావాల్సిన ఏర్పాట్లు.

విద్యారంగం:
విద్యారంగంలో మౌలిక అభివృద్ధికి రూ.లక్షకోట్లతో నిధి
నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేయనున్న కేంద్రం.
కొత్తగా 18 ఆర్కిటెక్చర్‌ కాలేజీల ఏర్పాటు
స్కూల్‌ టీచర్ల శిక్షణకు ప్రత్యేక స్కూళ్లు

డిజిటల్‌ విద్యావిధానానికి మరింత చేయూత
విద్యాభివృద్ధి కోసం జిల్లా కేంద్రంగా ప్రణాళిక
ఈ ఏడాది నుంచి పీఆర్‌ఎఫ్ ‌(ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌). టాప్‌ వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులకు ఫెలోషిప్‌లు
గ్రూప్‌ సీ, డీలలో ఇంటర్వ్యూలను ఇప్పటికే రద్దు చేశాం

వైద్య రంగం:
ఆరోగ్య రంగానికి భారీగా నిధులు. రూ.లక్షా 38 వేల కోట్లు కేటాయింపు
ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. పది కోట్ల కుటుంబాలకు లబ్ధి
ఆయుష్మాన్‌ భవ పథకంతో అందరికీ ఆరోగ్యం
ఆయుష్మాన్‌ భవ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్‌ కవరేజి. రూ.330 చెల్లిస్తే కుటుంబానికి ఆరోగ్య బీమా

జీవన ప్రమాణ పెంపునకు పైలెట్‌ ప్రాజెక్టు కింద 116 జిల్లాలు ఎంపిక, ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా అభివృద్ధి, టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి, టీబీ రోగులకు వైద్యం సమయంలో పౌష్టికాహారానికి నెలకు రూ.500
కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలకు అనుమతి
ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు

పారిశ్రామిక రంగం:
చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు రూ.3794 కోట్లు
పరిశ్రమలకు ఆన్‌లైన్‌ ద్వారా మరిన్ని రుణాలు
పరిశ్రమలకు ఆధార్‌ తరహా మరో కార్డులు
జౌళి రంగానికి రూ.7148 కోట్లు
కార్పోరేట్‌ పన్ను 2శాతం తగ్గింపు
వచ్చే మూడేళ్లకుగాను భవిష్యనిధికి 12శాతం నిధులు చెల్లింపు

పట్టణాలకు..
అమృత్‌ ప్రోగ్రాం కింద 500 నగరాలకు నీటి సరఫరా. ఇప్పటికే 494 కాంట్రాక్టులకోసం రూ. 19,428 కోట్లు కేటాయింపులు
10 ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుర్తించి వాటిని మరింత అభివృద్ధి చేయనున్న కేంద్రం.
భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు
దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల కింద 99 నగరాలు ఎంపిక. రెండు లక్షల కోట్లు కేటాయింపు.

రైల్వేలు-రహదారులు-ఎయిర్‌వేస్‌:
రైల్వే భద్రతకు పెద్ద పీట, సాంకేతిక పరిజ్ఞానం మరింత ఉపయోగించనున్న కేంద్రం.
రైల్వేకు రూ.1,48,000కోట్లు కేటాయింపు
రైళ్ల ఆధునీకరణకు ముందడుగు. కొత్తగా రైల్వేలకు 12,000 వ్యాగన్లు, 5160కోచ్‌లు, 700 లోకోమోటివ్స్‌.
అన్ని రైల్లే స్టేషన్లలో దశలవారిగా వైఫై, సీసీటీవీల ఏర్పాటు
25 వేలమంది ప్రయాణీకులు వచ్చే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు
36 వేల కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ల పునరుద్ధరణ
4వేల కిలో మీటర్ల మేర కొత్తగా రైల్వే మార్గం
18 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు
దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లు గుర్తించి వాటి అభివృద్ధి
భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి.

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుతం 124 ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా వాటిని 5 రెట్లు పెంచనున్నాం. ఏడాదికి బిలియన్‌ ట్రిప్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం
ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం ద్వారా 56 అన్‌ రిజర్వడ్‌ ఎయిర్‌పోర్ట్‌ల, 31 అన్‌ సర్వడ్‌ హెలిప్యాడ్ల అనుసంధానం
దేశ వ్యాప్తంగా రహదారులు, ఎయిర్‌పోర్ట్‌లు, నౌకశ్రయాలకు మధ్య అనుసంధానం

పెరిగిన రాష్ట్రపతి వేతనం:
రాష్ట్రపతి వేతనం రూ.5లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం 4లక్షలు, గవర్నర్‌ వేతనం రూ.3.5లక్షల వేతనం (నెలకు)
ప్రతి ఐదేళ్లకొకసారి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వేతనాలపై సమీక్ష.

ఎంపీల జీతాల పెంపుపై రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు
ప్రతి ఐదేళ్లకొకసారి ఎంపీల వేతనం పెంపు.
ప్రజా సేవకులకి జీతాలకు లిమిట్ లేదా..??
బడ్జెట్ లో అత్యంత చెత్త విషయం ఇదే..!

పన్నులు- ప్రత్యక్షం/పరోక్షం:
వ్యక్తిగత పన్ను శ్లాబులు యధాతథం
వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
గత ఏడాది ప్రత్యక్ష పన్నులు 12.6శాతం పెరిగాయి
కొత్తగా 81లక్షల ఐటీ రిటర్న్స్‌ దాఖలు
ఆదాయ పన్ను పరిధిలోకి కొత్తగా ఐదు లక్షల మంది
అదనంగా 90 వేల కోట్ల పన్ను వసూలు
వృద్ధులకు బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు

వృద్ధులకు రూ.50 వేల వరకు వైద్య ఖర్చులకు పన్ను మినహాయింపు. ఉద్యోగులకు రూ.40 వేల వరకు వైద్య ఖర్చులకు పన్ను మినహాయింపు

కార్పొరేట్‌ ట్యాక్స్‌ 25శాతానికి పెంపు.. దీని ద్వారా రూ.250 కోట్ల ఆదాయం టార్గెట్‌
వచ్చే ఏడాది ద్రవ్యలోటును 3.3శాతానికి తగ్గిస్తాం
ఈ ఏడాది దవ్యలోటు జీడీపీలో 3.5శాతం
స్టాంప్‌ డ్యూటీల విషయంలో కొత్త విధానం
ప్రతి వ్యాపార సంస్థకు యూనిక్‌ ఐడీ విధానం
బ్యాంకులకు మూలధనం కింద రూ.5లక్షల కోట్ల కేటాయింపు. రాష్ట్రం బడ్జెట్ లో జిల్లాల ప్రస్తావన లేనట్లే, దేశ బడ్జెట్ లో రాష్ట్రాల ప్రస్తావన లేదు. ఇది దేశ బడ్జెట్.
బడ్జెట్ లో రాష్ట్రానికి ఏంటి..?? అనేది తరువాత పోస్టు లో ఉంటుంది. జై హింద్..!??

No comments:

Post a Comment