Saturday, 5 May 2018

Budget 2018-19 వ్యవసాయరంగం

ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ఉన్నామనీ, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నామని జైట్లీ గారు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

నూతన భారత దేశ నిర్మాణంలో భాగంగా 2018-19 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి జరిగిన కేటాయింపులలో ముఖ్యాంశాలు:

?వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు కేటాయించారు.

?వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ ధర తక్కువగా ఉన్నప్పటికీ రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖరీఫ్‌ పంటలకు ఉత్పత్తి ధరకు ఒకటిన్నర (1.5) రెట్లు మద్దతు ధర ఇవ్వనున్నారు.

?ఈ-నామ్‌ (ఎలక్ట్రానికల్లీ లింక్‌డ్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) కార్యక్రమం కింద 585 హోల్‌సేల్‌ మార్కెట్లలో 470 మార్కెట్లను ఈ-నామ్‌కు అనుసంధానం చేశామని... 2018 మార్చి నాటికి మిగతా వాటిని అనుసంధానం చేస్తామని జైట్లీ గారు వెల్లడించారు.

?మత్స్య, పశు సంవర్థక శాఖలకు రూ.10 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేశారు.

?రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తామన్నారు. ఇక నుంచి చేపలు, పశు పెంపకం దారులకూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు విస్తరిస్తరించానున్నారు.

?జాతీయ వెదురు పరిశ్రమల కోసం రూ.1290 కోట్లను కేటాయించారు.

?ఆహార శుద్ధి రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.1400కోట్లను కేటాయించారు.

?42 మెగా ఫుడ్‌ పార్కులను పటిష్ఠం చేయనున్నారు.

?ఆహార శుద్ధి, వాణిజ్య శాఖలతో కలిసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు.

?గ్రీన్‌ క్లస్టర్ల కోసం రూ.500 కోట్లను కేటాయించారు. దీని ద్వారా త్వరగా పాడైపోయే టమాట, ఉల్లి తరహా ఉత్పత్తుల ధరల్లో భారీ హెచ్చు తగ్గులు రాకుండా చర్యలు తీసుకుంటారు.

?వైద్య పరమైన, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కల సేద్యానికి రూ.200కోట్లు కేటాయించారు.

?సేంద్రీయ వ్యవసాయంతో మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు.

?స్వయం సహకార సంఘాలను సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తామని చెప్పారు.

?కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చేలా కొత్త విధానం రూపొందించనున్నారు

?వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానాన్ని సరళీకరిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు.

#NewIndiaBudget #Budget2018

No comments:

Post a Comment