నా పేరు స్వప్న – Part 5
ఆయన : ఎక్కడా?
నేను : ఇక్కడే…
(ఆయన అటు ఇటూ చూసి..)
ఆయన : ఏ డ్రెస్ లో ఉన్నావ్?
(అటూ ఇటూ చూస్తే, రెడ్ డ్రెస్ లో ముగ్గురు, నలుగురు అమ్మాయిలు కనిపించారు..)
నేను : రెడ్ డ్రెస్ లో ఉన్నాను.
ఆయన కనీసం చూడనైనా చూడకుండా..) నువ్వు డెఫినెట్ గా రెడ్ డ్రెస్ వేసుకు రాలేదు.
(నేను ఆశ్చరయపోయాను.)
నేను : మీకెలా తెలుసు?
ఆయన : ఫస్ట్ టైమ్ తన లవర్ ని కలుసుకోడానికి వచ్చే ఏ అమ్మాయీ రెడ్ డ్రెస్ వేసుకోదు.
నేను : మరి?
ఆయన : పింక్ లేదా బ్లూ లేదా రెండూ కలసిన కాంబినేషన్.
( గబుక్కున నా డ్రెస్ చూసుకున్నా. పింక్ అండ్ బ్లూ…కొంపదీసి నన్ను కనిపెట్టేసాడా అనిపించింది. ఆయన వైపు చూస్తే అసలు ఎటూ చూడకుండా చిద్విలాసంగా కూర్చొని ఉన్నాడు.)
నేను : ఓకే…మీరు చెప్పింది కరెక్ట్. మరి నేనెక్కడున్నానో కనుక్కోండి. మీ అంతట మీరే కనుక్కుంటే, ఇప్పుడే మీరు ఎక్కడకి రమ్మంటే అక్కడకి వస్తా..
ఆయన: లేకపోతే…?
నేను : ఈ రోజుకి అంతే…మనం కలవం…3 మినిట్స్ టైమ్ మీకు..
ఆయన: ఓకె…ఓకే..
ఆయన పైకి లేచి రెస్టారెంట్ అంతా తిరిగి చూస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలతో ఏదో మాట్లాడితే, వాళ్ళు నవ్వి ఏదో చెప్పారు. ఆ తరువాత ఆయన నేను ఉన్న వైపుకు వచ్చారు. నేను టేబుల్ కిందకి దూరా. ఆయన చేతిలో సెల్ నన్ను చూస్తున్నట్టుగా అనిపించి, సిగ్గుపడ్డా. ఒక పది సెకన్ల తరువాత తిరిగి వెళ్ళి, తన సీట్ లో కూర్చొని మళ్ళీ మెసేజ్ పెట్టాడు.
ఆయన : అసలు నువ్వు వచ్చావా?
నేను : వచ్చా…ఇక్కడే ఉన్నా…మిమ్మల్ని చూస్తున్నా..
ఆయన : అసలు నువ్వెలా ఉంటావ్? చిన్న హింట్ అయినా ఇవ్వొచ్చుగా..
నేను : చెప్పాగా 34..26..34
ఆయన : నీ హింట్ తగలెట్టా… బట్టలుంటే కొలతలు కనిపెట్టడం రాదు నాకు.
( అది చూసి కిసుక్కున నవ్వాను. మళ్ళీ కంట్రోల్ చేసుకొని, మెసేజ్ పెట్టా.)
నేను : చూడగానే కొలతలు కనిపెట్టేసేలా ప్రాక్టీస్ చేయండి మరి..
ఆయన : నా పాక్టీస్ ఏదో నేను చేసుకుంటాలే గానీ, నువ్వు ఇక్కడకి రాకుండా గేమ్స్ ఆడతున్నావేమోనని డౌట్ వస్తుంది.
నేను : సరే బేరర్ తో నా బిల్ పంపిస్తే నమ్ముతారా?
ఆయన : యా..
నేను : ఓకే…కానీ నేను ఎక్కడున్నానో అతన్ని అడగకూడదు.
ఆయన : ఓకే..ఓకే..
నేను : బిల్ క్లియర్ చేసిన వెంటనే వెళ్ళిపోవాలి..
ఆయన : ఓకే..
నేను : బయటకూడా నా కోసం చూడకూడదు. ఆగకుండా డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోవాలి.
ఆయన : అమ్మా, తల్లీ…అన్నిటికీ ఓకే..పంపించు.
నేను నవ్వుకొని, బేరర్ ని పిలిచి బిల్ ఆయన కి ఇమ్మన్నాను. బేరర్ బిల్ ఇవ్వగానే ఆయన పాపం ఏమీ అడగకుండానే పే చేసేసి వెళ్ళిపోయాడు. నేను మరో పావుగంట అక్కడే ఉండి, తరువాత ఇంటికి చేరుకున్నాను.
ఆయన వచ్చే టైముకి స్నానం చేసి, పింక్, బ్లూ కాంబినేషన్ ఉన్న చీర కట్టుకొని రెడీ అయ్యా. ఇంతలో ఆయన రానే వచ్చాడు. పలకరింపుగా నవ్వి, పోయి ఎప్పటిలాగే టీ.వీ ముందు కూర్చొని టీ ఆర్డర్ చేసాడు. నా చీర గుర్తించనందుకు నాకు మండిపోయింది. రుసరుసలాడుతూ టీ తయారుచేసి ఆయనకి విసురుగా అందించి ఎదురుగా నిలబడ్డాను. “అబ్బా, టీ.వీకి అడ్డులే నీరూ..” అన్నాడు టీ చప్పరిస్తూ. “టీ.వీ తరువాత చూడొచ్చు. ముందు నన్ను చూడండి.” అన్నాను. “కొత్తగా ఏం చూడాలే నిన్నూ! పక్కకి తప్పుకో.” అని కసురుకున్నాడు. నాకు ఆశ్చర్యమేసింది. పెళ్ళయిన ఇన్నాళ్ళుగా ఎప్పుడూ అలా కసురుకోలేదు. ఉక్రోషం వచ్చేసింది. “కొత్తగా ఏం చూడాలా? రాత్రి కొత్తగా ఏం కనిపించిందనీ, 34..26..34 అంటూ నలిపి పాడేసారూ?” అన్నా అదే ఉక్రోషంతో. ఆయన నవ్వేసి “అదా…దానికి వేరే కారణం ఉందిలే..” అన్నాడు. “అదే…ఆ కారణమే చెప్పండి.” అన్నా మొండిగా. “అబ్బా…అన్నీ చెప్పుకోగలిగే కారణాలుండవే…పోయి నువ్వు వంట చేసుకో..” అని మళ్ళీ కసిరాడు. ఇక ఆయన దగ్గర ఉండలేక కాళ్ళు టపటపా కొట్టుకుంటూ వంటగదిలోకి పోయాను. వెళ్ళిన పది సెకన్ల లోనే మెసేజ్ వచ్చింది. “ఏం చేస్తున్నావ్ బంగారం?” అని ఉంది. సెల్ ని నేలకేసి కొట్టాలనిపించింది. అంతలోనే తమాయించుకుంటూ “ఏంలేదు…ఖాళీగానే ఉన్నా.” అని మెసేజ్ పెట్టా. “అయితే సరదాకి ఒక ముద్దు పెట్టొచ్చుగా..” అని పంపాడు. “చచ్చినోడా..” అని తిట్టుకున్నా. ఎదురుగా ఇంత అందమైన పెళ్ళాం ఉంటే, కనీసం చూడడానికి మనసు లేదు గానీ, అదెవ్వత్తో, ఎలా ఉంటుందో తెలియని దానిని ముద్దులు అడిగేస్తున్నాడు. ’మగబుద్ది..మగబుద్ది’ అని మళ్ళీ తిట్టుకున్నా. ఇంతలో మళ్ళీ మెసేజ్ వచ్చింది “ఉమ్మా..ఉమ్మా..” అని. కంపరం వచ్చేసి, ఆ సెల్ ను డబ్బాలో పడేసాను. ఎందుకో మళ్ళీ మెసేజ్ రాలేదు. వంట అయ్యేవరకూ బయటకి వినబడకుండా ఏడుస్తూనే ఉన్నాను. వంట కాగానే బయటకు వచ్చి “వంట అయింది, రండి తిందురుగాని.” అన్నా. “ఆఁ..వస్తున్నా స్వప్నా..” అని పైకి లేచి, నన్ను చూసి నాలుక కరచుకొని “అదే..వస్తున్నా నీరూ..” అన్నాడు. “స్వప్న ఎవరూ?” అన్నా సూటిగా చూస్తూ. (ఇంకా ఉంది)
Tuesday, 20 February 2018
నా పేరు స్వప్న – Part 5
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment