తెలుగు వారి గుండెచప్పుడు తారక రాముడి జననం 1923 మే 28 వ తేదీన.. మరణం 1996 జనవరి 18...
1996 జనవరి 18 వ తేదీ ఉదయం సుమారు ఆరు గంటల సమయం హైదరాబాద్ అంతా దావాగ్ని లా వ్యాపించింది
ఎన్టీ రామారావు గారు చనిపోయారని. ఒక్కసారిగా హృదయం బరువెక్కింది. వెంటనే బయిలుదేరాము చూడ్డానికి వెళ్ళాలి, అమీర్ పేట ప్రాంతాల్లో ఎంత గాలించినా ఎక్కడా పూల దండలు దొరకలేదు. నగరమంతా అన్న గారి మరణ వార్త వ్యాపించడంతో ఉదయాన్నే కావలిసినన్ని పువ్వులు దొరికే హైదరాబాద్ నగరంలో ఆరోజు దండలు కాదు కదా విడిపువ్వులు కూడా దొరకలేదు. నగరంలోని పువ్వులన్నీ రామారావు గారి మరణ వార్త బయిటకు రాగానే ఆయనకు నివాళులర్పించడానికి తరలిపోయాయి.
తారక రామారావు గారి మీద తెలుగు ప్రజల అభిమానానికి
ఇదొక నిదర్శనం.
ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఈ జీవన రంగస్థలం మీద
తెర దించేసి ఇప్పటికి 22 సంవత్సరాలు గడిచిపోయాయి... మరునాడు అంత్యక్రియలకు హాజరయిన అశేష జన వాహినిలో చిక్కుకుని మా మిత్రులు విడిపోవడం, వాహనాలు నడిచే దారి లేక అయిదారు కిలోమీటర్లు నడక మొదలయినవన్నీ నిన్న మొన్న జరిగినట్లున్నాయి. ఈ రోజు ఆ మహానుబావుడి 22 వ వర్థంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టాలు........
సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ లో ఆయన సమకాలికుల్లో ఆయనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు. వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్‌దే. పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి రామారావు గారు.
ఈ కారణాలవల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు.
తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.
స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావు గారిదే..
బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం ఆయనకు దక్కింది.
రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే.
దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత ఆయన. ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఆయన.
దేవేందర్ గౌడ్, కె.చంద్రశేఖరరావు మొదలైన నేతలు ఆయన పరిచయం చేసినవారే.
“నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ సమర్థించటం ఒక విశేషం.
మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఆయనను దర్శించుకుని వచ్చేవారు.
కొన్ని సాహసోపేత నిర్ణయాలు:
మహిళలకు ఆస్తి హక్కు,
మండల వ్యవస్థ,
వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్లు,
పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం,
రామారావుగారికి బాబాల, మఠాల పిచ్చి లేదు.
దేవునిపట్ల భక్తి ఉంది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది...
ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్టు, ఎడిటర్
నార్ల వెంకటేశ్వరరావు గారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు.
రామారావూ గారి నాయకత్వన జరిగిన కార్యక్రమాల జాబిత..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా ఒక వర్గం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో,
ఎన్టీఆర్ మిగతా కులముల వారికి ఆశాకిరణం లాగ కనిపించారు.. ఎన్టీఆర్ మొట్ట మొదటి సారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు.. అయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు.
తెలంగాణాలో బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి, తెలుగు ఘనకీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి తెలుగు ప్రజలకి ఆరాధ్యదైవంగా మారినారు....
రామారావు గారి చరిత్ర, వారి కీర్తిని బావితరాలకు తెలియచెప్పాలిసిన బాధ్యత ప్రతి తెలుగు వారి పై ఉందని తెలియచేస్తూ..
ఈరోజు నందమూరి తారక రామారావు గారి 22 వ వర్థంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ... (*!*)
??జోహార్ ఎన్టీఆర్???జోహర్ ఎన్టీఆర్??
Saturday, 5 May 2018
తెలుగు వారి గుండెచప్పుడు తారక రాముడి జననం 1923 మే 28 వ తేదీన.. మరణం 1996 జనవరి 18
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment